తెలుగు ఆడియెన్స్ లో అనూహ్యంగా ఓ మార్పు వచ్చింది. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అనగానే ఖచ్చితంగా దానికోసం టైం కేటాయించే ఆడియెన్స్ ఈమధ్య థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం మానేశారు. రెగ్యులర్ సినీ లవర్స్ తప్ప మిగతా వారంతా కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలన్న ఆసక్తి చూపించడం లేదు. అదీగాక థియేటర్ రిలీజైన సినిమా నెల రోజుల్లోగా ఓటీటీలో వస్తుండటంతో ఇక థియేటర్ కి వెళ్లి జేబులు చిల్లు పడేయించుకోవాలని అనుకోవట్లేదు.

అయితే ఇలాంటి ఆడియెన్స్ కోసం కొన్ని సినిమాలు నెల రోజుల్లో ఓటీటీ రిలీజ్ కాకుండా ఆరు నుంచి ఎనిమిది వారాల దాకా సినిమాని హోల్డ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి ఆడియెన్స్ చూసే అవకాశం ఉంటుంది. ఈమధ్య వచ్చిన ఎఫ్ 3, విక్రం సినిమాలు అదే ఫార్ములా ఫాలో అయ్యాయి. ఇక రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమా కూడా అదే ట్రిక్ ప్లే చేస్తుంది. జూలై 1న రిలీజ్ అవుతున్న పక్కా కమర్షియల్ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.

గోపీచంద్, రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా కమర్షియల్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సినిమా రిలీజ్ అయ్యాక ఐదు ఆరు వారాల తర్వాతే అని చెబుతున్నారు. ఇది ఓ రకంగా ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పించే ప్లాన్ అని చెప్పొచ్చు. నెల రోజుల్లో ఓటీటీ రిలీజ్ అంటే ఖచ్చితంగా ఆడియెన్స్ నెల రోజులు వెయిట్ చేసి సినిమా చూస్తారు. అందుకే పక్కా కమర్షియల్ టీం ఓటీటీ రిలీజ్ ని ఆరు వారాల తర్వాత పెట్టుకుంది.

మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమా విషయంలో చిత్రయూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే గోపీచంద్ కెరియర్ మళ్లీ గాడిలో పడినట్టే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: