యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమా లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కబోతోంది .

ప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించడంతో , మరి కొన్ని రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే బోయే సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు మాములు సినీ ప్రముఖులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా , రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమా షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కాబోతోంది అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించడంతో ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోం ది. 

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 వ సినిమా ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది. ఇలా ఎన్టీఆర్ 30 వ సినిమా ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి కూడా చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: