టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన తెలియని వరంటూ ఎవరు ఉండరు.ఇక ప్రస్తుతం ఈయన చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. ఇక ఇదిలావుంటే ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా రామ్ పోతినేని గురించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని..అంతేకాదు ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని మీడియాలో వార్తలొచ్చాయి.

ఇకపోతే  ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని కథనాలను ప్రచురించారు.ఇక  దీంతో రామ్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడేమో అని కొందరు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్పగా.. లేడీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలైపోయారు.ఇక అసలు విషయం ఏమిటంటే  తాజాగా ఇప్పుడు ఈ పెళ్లి వార్తలపై రామ్ స్వయంగా స్పందించారు.అయితే ఆయన  ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఏంటంటే  'ఓ గాడ్.. స్టాప్.. ఇప్పుడు నేను ఎలాంటి సిట్యుయేషన్ లో ఉన్నానంటే నా సొంత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ను నేను ఏ హైస్కూల్ స్వీట్ హార్ట్ ను పెళ్లి చేసుకోవడం లేదని కన్విన్స్ చేయాల్సి వస్తుంది.అంతేకాకుండా  నిజం చెప్పాలంటే.. నేను హైస్కూల్ కి వెళ్లిందే చాలా తక్కువ' అంటూ రాసుకొచ్చారు. 

ఇక దీంతో రామ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ వచ్చింది.ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు రామ్ పోతినేని ప్రస్తుతం ఈ హీరో నటించిన 'ది వారియర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.అయితే  లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.అంతేకాకుండా  ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ తరువాత బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారు రామ్. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: