పుష్ప సినిమా తర్వాత డైరక్టర్ సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన పుష్ప సినిమా మొదటి పార్ట్ చూసి సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. ఆ సినిమా ఆడిన అన్ని రోజులు దేశమంతా పుష్ప రాజ్ సింగేచర్స్ తో బీభత్సమైన వైబ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పుష్ప 2 మీద ఫోకస్ పెడుతున్నాడు సుకుమార్. త్వరలోనే పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

సినిమా తర్వాత సుకుమార్ అసలైతే విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సుకుమార్ సినిమాల లిస్ట్ లో మహేష్ తో ఓ సినిమా ఉంటుందని టాక్. సర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి మూవీ లైన్ లో ఉంది. అయితే మహేష్ 30 వ సినిమా మళ్లీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కే సైన్ చేశాడట. అది సుకుమార్ డైరక్షన్ లోనే ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మహేష్, సుకుమార్ కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశారు.

సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. కానీ ఆ మూవీలో మహేష్ నటన ఇప్పటికీ అందరు చెప్పుకునేలా ఉంటుంది. మరోసారి ఆ కాంబో రిపీట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప సినిమా కన్నా ముందు సుకుమార్ తో మహేష్ సినిమా చేయాల్సి ఉన్నా క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పి ఇద్దరు వేరే వేరే ప్రాజెక్ట్ లు చేశారు. మరి ఈసారైనా సరే సుకుమార్, మహేష్ కలిసి సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి. త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమా స్టర్ట్ అవడానికి ముందే మరో సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడట. మరి అది సుకుమార్ తో అవుతుందా లేదా అన్నది చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: