టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఓ పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్ అలాగే లవ్ స్టోరీస్ లో నటిస్తోంది.


బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. ఇటీవల 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోందట.హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విమెన్ సెంట్రిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందట..


శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. అదే సమయానికి చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయట.. దీంతో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ ఈ పోటీలో సమంత వెనక్కి తగ్గదని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాల వలన 'యశోద' సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి కారణం మాత్రం అస్సలు బయటకు రాలేదు.


 


త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట.. ఈ సినిమాలో సమంత గర్భవతిగా కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు సమంత చేసిన సినిమాలకు భిన్నంగా ఈ స్టోరీ ఉండబోతుందని సమాచారం.. తెలుగులో చిత్రీకరిస్తోన్న ఈ సినిమాను మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.


 


ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ లాంటి తారలు కనిపించనున్నారట . మణిశర్మ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పులగం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్నారు. విభిన్న పాత్రలతో ఎంతగానో ఆకట్టు కుంటున్న సమంత యశోద సినిమా లో కూడా కొత్త గా కనిపించ నుందట. ఈ పాత్రలో సమంత జీవించిందట...

మరింత సమాచారం తెలుసుకోండి: