కొంతకాలం క్రితం వరకు ఏదైనా సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది అంటే చాలా రోజుల వరకు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. కొన్ని సినిమాలు నేరుగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతూ ఉంటే, మరి కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. 

కొన్ని ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు కూడా థియేటర్ లలో విడుదల అయిన నెల తిరక్కుండానే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కోవలోకే దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన విరాటపర్వం సినిమా కూడా విడుదల అయ్యి నెల రోజులు కూడా తినకుండానే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రావడానికి రేడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ లభించినప్పటికీ కలెక్షన్ లను మాత్రం పెద్దమొత్తంలో సాధించడంలో ఈ సినిమా కాస్త వెనకబడిపోయింది.

ఇది ఇలా ఉంటే విరాట పర్వం సినిమాను జూలై 1 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది. మరి ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే జూలై 1 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి. విరాటపర్వం సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించగా, సురేష్ బెబ్బులి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: