పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకి తెలిసిన విషయమే. బాహుబలి, కేజిఎఫ్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్నది ఇ చిత్రం. ఇండియాలోనే వసూళ్ళ పరంగా టాప్-5 లో ఉన్నది RRR. వాణి ఇండియా కేటగిరీలో ఈ సినిమా విడుదలై అన్ని భాషలలో కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాతో రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా ఇద్దరు కూడ పాన్ ఇండియా స్టార్స్ గా ఫేమస్ అయ్యారు.


రాజమౌళి డైరెక్షన్ నుంచి వచ్చిన ఈ విజువల్ ట్రేడ్ సినిమా అమెరికాలో కూడా నాన్ ఇండియా సైతం ఫిదా చేసింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో వారి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. దాదాపు అన్ని ట్వీట్ లు కూడా చాలా పాజిటివ్ గానే వచ్చాయి. సినిమా బాగాలేదు అన్న విమర్శలు ఎక్కడ కూడా రాలేదు హిందీలో సైతం నాన్ ఇండియన్ బాగా నేర్చుకున్నారు ఇక ఇదే చిత్రాన్ని ఇంగ్లీషులో కూడా విడుదల చేసి ఉంటే మరింత ఆదరణ దొరికేదో ఆన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాల సింపుల్గా తీసేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీరు చూసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అని అడగగా.. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు టీవీ పెడితే ఆ సమయంలో అక్కడ ఉంటే అలా చూసి వెళ్ళిపోతాను.. చూడాలనిపించదని తెలిపారు. ఈ మధ్యకాలంలో చూసిన సినిమా ఏదైనా ఉందా అని అడగగా.. కాసేపు ఆలోచించి అదేదో rrr అంట అప్పుడది టీవీలో పిల్లలు పెట్టారు. అప్పుడే అలా టీవీ చూశాను ఒక్క నిమిషం కూడా ఆ సినిమా చూస్తూ ఉండలేకపోయానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కే ఏ పాల్ ట్రోలింగ్ గురవుతున్నారు. అవును ఆయన చెప్పిన వాక్యం నిజమే ఉండొచ్చు.. ఎందుచేతనంటే ఆయన చాలా బిజీగా ఉంటారు సినిమాలు చూసి అంత సమయం కూడా ఉండదు ఆయన వ్యాపారాలు క్రైస్తవ మత ప్రచారం లో చాలా బిజీగా ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: