టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం  మాస్ హీరోలలో ఒకరిగా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న గోపీచంద్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ తన కెరియర్ ని హీరోగా తొలి వలపు సినిమాతో మొదలు పెట్టాడు. గోపీచంద్ హీరోగా నటించిన మొదటి సినిమా తొలి వలపు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు .

జయం సినిమా సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా ,  విలన్ గా గోపీచంద్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను తీసుకు వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ వరుసగా వర్షం , నిజం సినిమా లలో విలన్ గా నటించాడు . ఈ సినిమా లలో వర్షం సినిమా సూపర్ హిట్ గా నిలవగా నిజం సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ గోపీచంద్ కు మాత్రం విలన్ గా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇలా హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి, విలన్ గా సూపర్ సక్సెస్ ను సాధించిన గోపీచంద్ ఆ తర్వాత మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత నుంచి హీరోగానే కెరియర్ ను కంటిన్యూ చేస్తూ అనేక విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్న గోపిచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ప్రస్తుతం హీరోగా తాను నటిస్తున్న సినిమాలు సంతృప్తిని ఇస్తున్నాయి అని , మంచి పాత్ర దొరికితే మళ్లీ విలన్ పాత్రలో నటించడానికి రెడీ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: