రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించబోతున్నాట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సలార్ మూవీ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం సలార్ చిత్ర బృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్  తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సప్తగిరి సలార్ మూవీ లో  ఫుల్ లెంత్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ మూవీ కోసం సప్తగిరి 30 రోజులను కేటాయించినట్లు సమాచారం.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సప్తగిరి సలార్ మూవీ లో ఫుల్ లెన్త్ రోల్ లో అలరించబోతున్నాట్లు ఒక టాక్ నడుస్తోంది. ఈ వార్తే కనుక నిజం అయితే సప్తగిరి కి పాన్ ఇండియా రేంజ్ లో కమెడియన్ గా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలపై ప్రశాంత్ నీల్ ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: