ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యంగ్ రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్.. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం గా తెరకెక్కుతున్న విషయం తెలిసింది . ఇక సాలా క్రాస్ బీడ్ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఇకపోతే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ సినిమాలో మొదటిసారి కనిపించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే నేడు లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు సంబంధించి ఒక వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది.

ఇక ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించగా షూటింగ్ సెట్లో రౌడీ బాయ్ గురించి కూడా ఆమె చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాకు ఛార్మీ కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే విష్ణు, పూరీ జగన్నాథ్,  విజయ్ దేవరకొండ, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు చార్మికౌర్, అనన్య పాండే వంటి వారు మైక్ టైసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. అంతేకాదు లైగర్ సినిమా USA షెడ్యూల్ కి సంబంధించిన మేకింగ్ విజువల్స్ ను  కూడా ఈ వీడియో ద్వారా మనం చూడవచ్చు. అంతేకాదు ఈ వీడియో ద్వారా మైక్ టైసన్ సింప్లిసిటీ తో పాటు హంబుల్ ఆటిట్యూడ్ కూడా మనం చూడవచ్చు . ముఖ్యంగా ఇంత బాక్సింగ్ దిగ్గజం అయిన  మైక్ టైసన్ అందరితో కలిసి ఉల్లాసంగా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఇక రౌడీ హీరోను గట్టిగా కౌగిలించుకొని అతడి బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు మైక్ టైసన్. ఇకపోతే బిగ్ స్క్రీన్ పై బిగ్ క్లాష్ ని చూడడానికి వేచి ఉండండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఒక పక్కా  లైగర్ మరొకపక్క లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కలిసి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: