రామ్ పోతినేని హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి లింగు స్వామి దర్శకత్వంలో రాబోతు న్న ది వారియర్ చిత్రం. తెలుగు తమిళ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా షూటింగ్ ఏకకాలంలో రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇప్పటికే పూర్తి కాగా జూలై 14న ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే డేట్ ను కూడా ప్రకటించారు. భారీగా ప్రమోషన్స్ ను ప్రారంభించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇకపోతే ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలకు బ్రహ్మరథం పడుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఆ పాటలకు భారీ స్థాయిలో వ్యూస్ లభిస్తున్నాయి. టీజర్ కూడా ఆ మధ్య విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఆ విధంగా ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.  ఈ సినిమా తర్వాత రామ్ ఊర మాస చిత్రాలను తెరక్కించే దర్శకుడైన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రాబోతున్నట్లుగా చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి ఈ సినిమా లో రా మ్ ఒక్కడే హీరో కాదని మరొక హీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని చెబుతున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా ఇందులో మరొక హీరోగా నటిస్తున్నారని అన్నారు అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో కేవలం రామ్ ఒక్కడే హీరో అని వేరే హీరోలు ఎవరు లేరని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తున్నాడు రామ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: