వారసులు సినిమా ఇండస్ట్రీకి రావడం కొత్తేమీ కాదు చాలామంది నటవారసులు సినిమా పరిశ్రమంలోకి వచ్చి విజయవంతం అయ్యారు తమ టాలెంటును ప్రదర్శించలేక కొంతమంది మధ్యలోనే కనుమరుగయిపోగా మరి కొంతమంది సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎదిగారు. ఆ విధంగా ఇప్పుడు మరొక నట వారసుడు ప్రేక్షకుల ముందుకు పరిచయం అవడానికి సిద్ధమవుతున్నాడు. ఆయనే అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ గణేష్.

ఇప్పటికే ఆయన పెద్ద తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు మాస్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇప్పుడు బాలీవుడ్ లో లాంచ్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా ఓ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు స్వాతి ముత్యం అనే టైటిల్ను నిర్ణయించారు ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. టీజర్ ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమా యొక్క క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పాలి. సక్సెస్ఫుల్ సినిమా టైటిల్ కావడం టీజర్ కూడా దానికి తగ్గట్టుగా ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి బెల్లంకొండ గణేష్ కు ఇది విభిన్నమైన సినిమా అవుతుందని పలువురు చెబుతున్నారు. ఆయనకు బెస్ట్ డబ్ల్యూ సినిమా అవుతుందని అన్నారు. మరి ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. టీజర్ లో అయితే ఈ హీరో తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. వర్ష బోల్లమ్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: