తమిళనాడు లో మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తీ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతూ ఆయనకు ఇక్కడ మంచి మార్కెట్ను ఏర్పరిచింది. ఇప్పుడు కూడా ఆయన నటిస్తున్న పలు సినిమాలు తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన సర్దార్ సినిమాను పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలో రాశీకన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇతర ల్ల కీలక పాత్రలలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటిస్తున్నారు. అలనాటి మేటి నటి లైలా కూడా ఈ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23వ తేదీన దీపావళికి విడుదల చేయబోతున్నారని అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. కార్తీ  ఖైదీ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ప్రేక్షకులను అలరించిన ఆయన కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.  ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో ఆయన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి 

ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన రెండు గెటప్ లు కూడా రివీల్ అయ్యాయి. మరొక పాత్రలో ఖైదీగా 70 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడు కార్తీ. ఈ రెండు పాత్రల మేకోవర్ కోసం ఆయన చాలానే శ్రమించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క అప్డేట్లు సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచింది. కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న కార్తి ఈ చిత్రం ద్వారా కార్తీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రం తర్వాత ఖైదీ రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: