సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కెజిఎఫ్. అసలు ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ కన్నడ చిత్రం విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుని ఢమరుకం మోగించింది. అప్పటి వరకు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన హీరో యశ్ కెజిఎఫ్ తర్వాత ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు యశ్ అంటే ఉన్న కిక్కే వేరప్ప. అందులోనూ కెజిఎఫ్ 2 తర్వాత మరి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ ఆరడగుల ఆజానుబాహుడుకి బాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది. అప్పట్లో ఎక్కడ చూసినా కేజీఎఫ్ హీరో భారీ పోస్టర్లతో హిందీ అభిమానులు చేసిన సందడి అంత ఇంతా కాదు. అసలు యశ్ అంటే కన్నడ హీరో మాత్రమే కాదు...అన్ని భాషల అభిమాన తార.

కాగా ఇపుడు ఈ పాన్ ఇండియా హీరోతో సినిమాలు చేయడానికి బడా బడా దర్శకులు మరియు నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న ప్రముఖ దర్శకుడు శంకర్ కూడా కేజీఎఫ్ హీరో యశ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అంతే కాదు ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కూడా అనేసుకున్నారు అని ప్రస్తుతం స్టోరీ డెవలపింగ్ జరుగుతుంది అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఆల్రెడీ మన తెలుగు హీరో రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ కి టై అప్ అయున్న దర్శకుడు శంకర్ ఈ చిత్రం తర్వాతే యశ్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు.  
 
అంతేకాదు నలుగురు బడా నిర్మాతలు కలిసి మెగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. చారిత్రాత్మక నేపథ్యంలో, యుద్ధం తరహాలో ఈ సినిమా ఉండనుంది అని టాక్. మరి ఈవార్తలో ఎంతటి నిజముందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇటీవల విక్రమ్ తో ఘనవిజయం అందుకున్న కమల్ హాసన్ ఒక పాత్రలో నటించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: