సినిమా పరిశ్రమలో ఎవరికైనా అండదండలు ఉంటే వారి కెరీర్ ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు హీరోల సపోర్ట్ కానీ దర్శకుల సపోర్ట్ కానీ నిర్మాతలు సపోర్ట్ ఉండాలి అప్పుడే వారికి మంచి మంచి అవకాశాలు పెద్ద సినిమాల అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రముఖ దర్శకుడు రచయిత త్రివిక్రమ్హీరోయిన్ కి చేయూత గా ఉండడం ఆమెకు అవకాశాలు రావడానికి కారణం అవుతుంది. ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచే టాలెంట్  కు అభయ హస్తం తోడయితే వారికి అవకాశాలు కూడా బాగానే వస్తుంటాయి

ఆ విధంగా తెలుగులో నటించిన తొలి సినిమాతోనే మంచి టాలెంటెడ్ నటి అనిపించుకుంది సంయుక్త మీనన్. త్రివిక్రమ్ రచయితగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలలో కనిపించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ వచ్చిన గుర్తింపు తో ఆమె తెలుగులో కి ఎంట్రీ ఇవ్వగా తొలి సినిమాలో ఆమె నటించిన తీరుకు అందరూ ముగ్ధులై పోయారు.  ఆ విధంగా తొలి సినిమాతో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్న ఈమె ప్రేక్షకులను కూడా తన అందచందాలతో ఎంతగానో ఆకట్టుకుంది.

 ఈ నేపథ్యంలోనే ఆమెలోని ప్రతిభను గమనించిన త్రివిక్రమ్ భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుందని చెప్పి ఆమెకు చేయూతనిస్తున్నారు ఆమెకు పలు అవకాశాలు రావడంలో ఆయన హస్తం కూడా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఆయన చేయబోయే సినిమాలో కూడా ఈమె కోసం ఓ మంచి పాత్రను క్రియేట్ చేశారట సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రానికి ఆయనే రచయితగా వ్యవహరిస్తుండడం విశేషం. తమిళ సినిమా వినోదాయ శితం ఆధారంగా తెరకెక్క బోతున్న ఈ మూవీని తెలుగులో చేస్తున్నారు మరి త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేసి చూడవలసింది ఈ చిత్రంలో సాయి ధరంతేజ్ కూడా మరొక పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: