బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రభాస్ చిత్రం ఛత్రపతి ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకుడు రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కించగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. భారీ రికార్డులను సాధించి ప్రభాస్ ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో లాంచ్ అయితే తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ భావించాడు.

అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సాహసం చేశాడు.  ప్రేక్షకులు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని భావిస్తున్నారు.  బాలీవుడ్ ప్రేక్షకులలో బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలను అక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ నేపథ్యంలో అక్కడ తనకున్న మార్కెట్ను చూసి ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నాడు.  మేకోవర్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ స్థాయిలో కనిపించడానికి చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ విధంగా ఈ సినిమా ఎన్నో కష్టాల మధ్య తెరకెక్కిన కూడా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం అసలు ఈ రీమేక్ కు ఏమయిందో అన్న అనుమానాలను కలిగిస్తుంది.

ప్రస్తుతానికి అందరూ ఖాళీగా ఉండటంతో ఈ రీమేక్ సినిమా ఉన్నట్ల లేనట్లా అనే కామెంట్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక ఇన్ని కారణాల మధ్య ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు చేస్తాడో చూడాలి. తాజాగా ఈ సినిమాకు మరో సమస్య ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించుకున్న కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కి టైటిల్ దొరకని పరిస్థితి. కరెక్ట్ గా యాప్ అయ్యే టైటిల్ కోసం మేకర్స్ తెగ వెతుకుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: