వెండి తెర నుండి బుల్లి తెర వరకు సెలబ్రెటీల గురించి ఎపుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు కోకొల్లుగా వినపడుతున్నాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. వీరి గురించి ఎపుడు ఎదో ఒక న్యూస్ వైరల్ గా హాల్ చల్ చేస్తున్నాయి ఉంటుంది. ఇదిలా ఉండగా...తాజాగా టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోతో తెలుగమ్మాయి డేటింగ్ చేస్తోంది అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. సాధారణంగా ఇలాంటివి అపుడపుడు వినిపిస్తూనే ఉంటాయి. ఆ హీరోహీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని, ఆ హీరోయిన్ ఆ నటుడితో ప్రేమలో మునిగి తేలుతోంది అని ఇలా చాలా కామన్ గా వస్తుంటాయి.

అయితే ఇందులో కొన్ని నిజాలు ఉండగా మరికొన్ని కల్పితాలు కూడా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కాగా తాజాగా మరొక రూమర్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రచారం అవుతోంది. టాలీవుడ్‌లో స్టార్ యంగ్ హీరో, అప్ కమింగ్ తెలుగు హీరోయిన్ ప్రేమలో పడ్డాడు అని ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడు అని  గాసిప్స్ వైరల్ గా మారుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి నటించగా ఆ టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇప్పుడు వారు డెటింగ్‌లో ఉన్నారంటూ టాలీవుడ్‌లో కొందరు అంటున్నారు. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ యంగ్ హీరో, తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొనీ ఇపుడు బిజీ హీరోగా మారిపోయాడు.

మరోవైపు మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆ యంగ్ హీరోయిన్ తన కెరియర్ ను పట్టాలెక్కించే బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది.  ఆ మధ్య వీరికి బ్రేకప్ అయిందని వినిపించగా మళ్ళీ ఇద్దరు తరచూ కెమెరాలకు కలిసి చిక్కుతుండటం తో మళ్ళీ వీరి గురించి వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: