ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ ఛానెల్ ఈటీవీలో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అన్నది అందరికి తెలిసిందే. ఆ షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ స్టార్స్ గా మారారు. ఎంతోమంది కి అది జీవణాధారం అయ్యింది. దాదాపు ఎనిమిది ఏళ్లుగా బుల్లితెర మీద తిరుగులేని ఆధిపత్యం సంపాదిస్తున్న జబర్దస్త్ షో నుంచి ఈమధ్య వరుసగా కమెడియన్స్ బయటకు వస్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు రావడం అనేది ఓ గొప్ప విషయంగా మారింది.

బయటకు వచ్చిన కొందరు కమెడియన్స్ పరిస్థితి బాగాలేకపోవడం తో అక్కడ ఉండటమే బెటర్ అని కొందరు భావించారు. కానీ రాను రాను జబర్దస్త్ లో కండీషన్స్ ఎక్కువ అవుతుండటం వల్ల అక్కడ నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైంది. ఈమధ్యనే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి స్టార్ మా సూపర్ సింగ్ జూనియర్స్ షో చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా హాట్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ షో కి బై బై చెప్పేసింది.

ఓ రకంగా వీరందరికి జబర్దస్త్ ఫ్లాట్ ఫాం వల్లే ఓ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా జబర్దస్త్ ని వీడి కొత్త ఛానెల్ కి జంప్ అవుతున్నారు. అనసూయ కూడా రావడం తో జబర్దస్త్ షో మీద బాగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. పెద్ద తలకాయలే జబర్దస్త్ వదిలేశాయి అంటే ఇక అక్కడ ఉన్న మరికొంతమంది కూడా ఖాళీ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ టైం లో స్టార్ మా కామెడీ స్టార్స్ వెరైటీ స్కిట్స్ తో సత్తా చాటాలని చూస్తుంది. వీరందరు వీడుతుంటే మల్లెమాల గూడు చెదిరి కొత్త కమెడియన్స్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఉన్న పాత కమెడియన్స్ తో ప్రస్తుతం షో నడిపిస్తూ ఆడియెన్స్ మెప్పు పొందాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: