డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. అదే డేరింగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా సినిమా తప్పకుండా ఆడియెన్స్ కు మాస్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. లైగర్ సినిమా రిలీజ్ కాకుండానే పూరీ జగన్నాథ్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు కలిసి లైగర్ రిలీజ్ అవకుండానే జన గణ మన సినిమా చేస్తున్నారు.

జన గణ మన సినిమా పూరీ ఎప్పుడో రాసుకున్న కథ. సూపర్ స్టార్ మహేష్ కోసం రాసుకున్న ఈ కథని ఫైనల్ గా విజయ్ తో చేస్తున్నాడు. విజయ్ దేవరకొండకి తగినట్టుగా ఈ సినిమా కథని మార్చి సిద్ధం చేశాడట. ఈమధ్యనే లైగర్ పూర్తి చేయగా రీసెంట్ గా జన గణ మన సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత పూరీ డైరక్షన్ లో మూడవ సినిమా కూడా ఓకే చేశాడట విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ, పూరీ కాంబో లో హ్యాట్రిక్ మూవీ కూడా వస్తుందని తెలుస్తుంది. మరి వరుసగా విజయ్ తో పూరీ సినిమాలు చేయడానికి కారణం వారి మధ్య ఏర్పడ్డ బాండింగ్ అని తెలుస్తుంది. పూరీ అంటే ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు. పూరీ యాటిట్యూడ్ నచ్చిన విజయ్ అతనితో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. లైగర్ హిట్ అయితే జన గణ మన కు క్రేజ్ వస్తుంది. అది కూడా హిట్టు పడితే మాత్రం ఇక రాబోయే 3వ సినిమాకు డబుల్ క్రేజ్ వస్తుంది. ఈ హ్యాట్రిక్ హిట్ సినిమాలతో పూరీ, విజయ్ ఇద్దరు తమ స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: