ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులో వీరోచితంగా పోరాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం మేజర్. ఈ సినిమాలో హీరోయిన్గా శోభిత ధూళిపాల నటించిన విషయం తెలిసిందే. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని రేతిలో విడుదలకు ముందే ప్రేక్షకుల కోసం ఏకంగా 10 రోజులు ముందే ఈ చిత్రాన్ని పలుచోట్ల ప్రీమియం షో నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొనడంతో జూన్ మూడవ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్ళను కూడా రాబట్టింది.


ఇక ప్రముఖ దర్శకుడు శశికిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా బాగా అలరించింది. వెండితెరపై ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్క్రీన్ పై  కూడా సందడి చేయడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా విడుదల అయ్యి కనీసం నెలరోజులు కూడా కాకుండానే  ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూలై మూడవ తేదీ నుంచి మేజర్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా మేజర్ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిర్వాహకులు.

ఇకపోతే ఇప్పటికే థియేటర్లలో సినిమాను మిస్ అయినవారు.. ఇంకొకసారి సినిమా చూడాలని ఎదురు చూసే సినీ ప్రేక్షకులకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇటీవల నెట్ఫ్లిక్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఎవరికీ తెలియని ఒక కొడుకు కథ.. ఒక తండ్రి కథ .. ఒక సైనికుడు కథ.. మేజర్ సినిమా నెట్ఫ్లిక్స్ లో జూలై మూడవ తేదీ నుంచి తెలుగు , మలయాళం , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది అని నెట్ ఫ్లిక్స్ వారు ట్వీట్ కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: