సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారిపోతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. అప్పటివరకు సాదాసీదా హీరోగా కొనసాగిన వారు ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదిస్తూ ఉంటారు. అదే సమయంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు ఆ తర్వాత కాలంలో కెరియర్ దెబ్బతిని చిత్ర పరిశ్రమలో కనుమరుగై పోతుంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది విషయంలో జరిగింది అని చెప్పాలి.


 అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోలుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు కొంతమంది. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలని ఎదుర్కొని చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని నిలబడిన వారు  కొంతమంది ఉన్నారు. అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రవితేజ విజయ్ దేవరకొండ లాంటి వారు కూడా ఏం బ్యాగ్రౌండ్ లేకుండా కష్టాలు పడి స్టార్ హీరోలుగా ఎదిగిన వారే. దర్శకుడిగా మారాలని రవితేజ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కానీ తర్వాత తనలో ఉన్న నటుడిని గుర్తించి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జీవితం ప్రారంభించి తర్వాత హీరోగా మారిపోయాడు.


 విజయ్ దేవరకొండ సైతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు అన్న విషయం తెలిసిందే.  ఒక్కసారిగా  హీరోగా అవతారమెత్తి  ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇలా నాడు చిరంజీవి మోహన్ బాబు లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల నుంచి హీరోగా ఎదిగారు. ఇక నేటి జనరేషన్ లో అటు రవితేజ విజయ్ దేవరకొండ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోలు గా ఎదిగి సత్తా చాటుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక నేటి జనరేషన్ లో ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ మాత్రమే కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ నేరుగా ఇండస్ట్రీ హీరోలు గానే పరిచయం అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: