టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే మాస్ ఇమేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తుండగా , ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు . 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా ఈ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగ వంతం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా  ఈ సినిమా నుండి 'నా పేరు సీసా' అనే  వీడియో సాంగ్ ప్రోమో సాంగ్ ను కూడా చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

ఈ ప్రోమో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే 'నా పేరు సీసా' ఫుల్ సాంగ్ ను జూలై 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి  సామ్ సి ఎస్ సంగీతాన్ని సమకూర్చగా , నాజర్ , పవిత్ర లోకేష్ , తనికెళ్ల భరణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: