జీవితా రాజశేఖర్ ల ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాని రాజశేఖర్ తన సినిమా కెరీర్ ను అద్భుతం సినిమాతో మొదలు పెట్టింది. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన అద్భుతం సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో విడుదల అయ్యింది . ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఆ తర్వాత శివాని రాజశేఖర్ 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా థియేటర్లలో కాకుండా నేరుగా సోనీ లివ్ 'ఓ టి టి' లో విడుదల అయ్యింది. తాజాగా శివాని రాజశేఖర్ తన తండ్రి రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే శివాని రాజశేఖర్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా శివాని రాజశేఖర్ నటించిన రెండు తమిళ్ సినిమాలు ఇప్పటికే విడుదలకు కూడా అయ్యాయి. ఇలా తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో సినిమాను మొదలు పెట్టింది.

తెల్లవారితే గురువారం మూవీ ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రాహుల్‌ విజయ్‌ సరసన శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఎటర్నిటీ ఎంటర్‌‌టైన్మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. జులై 6 వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: