టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుని ప్రేక్షకులను బాగా అలరించిన హీరోలలో ఒకరు నేచురల్ స్టార్ నా ని. ఆయన గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాప్ లు అందుకుంటూ తన అభిమానులను ఏమాత్రం అలరించలేకపోతున్నాడు. వాస్తవానికి నానికి విజయం దక్కి చాలా రోజులు అయిపోయిందని చెప్పాలి. గత ఏడాది విడుదలైన శ్యామ్ సింగరాయ్ చిత్రం పరవాలేదనే హిట్ అనిపించుకోగా గత ఆరు సినిమాలుగా హిట్ అనేది ఎరుగకుండా నాని ఫ్లాప్ సినిమాలను చేస్తూ వచ్చాడు.

నాని క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అవుతుందో తెలియట్లేదు కానీ గతంలో బలం అనుకున్న కథ విషయంలో ఇప్పుడు పొరపాటు చేస్తున్నారు. సరైన కథ ఎంచుకోకపోవడం వల్లనే ఆయనకు ఈ విధమైన ఫ్లాప్ లు వస్తున్నాయి.  ఇటీవల విడుదలైన అంటే సుందరానికి సినిమాతో సైతం ఆయన ఫ్లాప్ ఎదుర్కోగా ఇప్పుడు ఆయన రాబోయే సినిమాపైనే అందరి దృష్టిపడింది. అంటే సుందరానికి సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఆ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని భావించగా ఆ సినిమా లెంత్ ఎక్కువ కావడం బోర్ కొట్టించడం లాంటివి ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్య కారణాలు.  

దాంతో ఇప్పుడు చేస్తున్న దసరా చిత్రంతో ఎలాగైనా కం బ్యాక్ చేయాలని నాని భావిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆయన పాన్ ఇండియా వైడ్  విడుదల చేయడానికి సన్నాహాలు చేయడంపై కొంతమంది సినిమా విశ్లేషకులను కలవర పరుస్తోంది.. తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా కూడా పరాజయాలు ఎదురు కావడంతో ఈ హీరోకి ఇప్పుడు సరైన మార్కెట్ లేదు. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కావాలి అంటే ఆయనకు హిట్ లు దక్కాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న దసరా సినిమా పాన్ ఇండియా సినిమా విడుదల చేస్తే నాని ఇబ్బందులు ఎదుర్కొంటాడనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: