పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో ఏ సినిమా విడుదల అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన సినిమాలు గందరగోళంగా మారాయి. రాజకీయాలలో పూర్తిస్థాయిలో బిజీ కాకముందే సినిమాలను చేసి ప్రేక్షకులను ఆనంద పరచాలని భావించాడు. అయితే కారణమేంటో తెలియదు కానీ ఆయన సినిమాలు విజయాలు అవుతున్నా కూడా మునుపటి క్రేజ్ ఆ చిత్రాలకు రావటం లేదు.

అయితే తక్కువ సమయంలో అయిపోయే సినిమాల కోసం ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పు కున్న సినిమాలను దూరం పెట్టడం ఆయా సినిమాల బృందాలకు ఏ విధంగా నచ్చడం లేదు. క్రిష్ దర్శకత్వంలోను హరిహర వీరమల్లు సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. మొదట్లో ఈ సినిమాను కొంత భాగం షూటింగ్ చేశారు. మల్లీ ఆ సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం అందరిని నిరాశ పరుస్తుంది. పవన్ కళ్యాణ్ తొలిసారి ఓ చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్నాడు అని తెలియగానే అభిమానులు ఎంతో ఆనందపడ్డారు.

కానీ ఆ సినిమా ఎప్పుడు పూర్తయ్యి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోయే క్రేజీ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  అయితే ఆ సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం ఈ కాంబినేషన్ అభిమానులను ఎంత గానో నిరాశ పరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు కాకుండా ఆయన వేరే సినిమాలను ఒప్పుకొని షూటింగ్ లకు వెళుతూ ఉండడం నిజంగా అందరినీ ఎంతో నిరాశ ప రుస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టులు ఆలస్యం చేస్తూ ఉండడం ఈ సినిమాలో జరుగుతాయా అన్న అనుమానాలను రెట్టింపు చేస్తుంది. మరి వీటి సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: