బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ గర్భం దాల్చినా కూడా షూటింగ్ విషయంలో తగ్గేదే లేదు అంటూ దూసుకుపోతోంది . స్టార్ హీరోయిన్ గా ఈమె  నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కారణంగా వాటిని పూర్తి చేసే వరకు అలియా విరామం లేకుండా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రన్వీర్ సింగ్ సరసన రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహాని సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ భాగం చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉండడంతో విదేశాలలో షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

అయితే ఈ పాటను సినిమా షూటింగ్ చివర్లో షూట్ చేద్దామని వదిలేసిన చిత్రం యూనిట్ ఇప్పుడు ఆ సమయం కాస్త ఆసన్నమైంది. ఈ మొదటి వారంలో ఆ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా ఆస్ట్రియాలో అలియాతో పాటు రణ వీర్ పై షూట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఆస్ట్రియాలో అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటు సెట్స్ కి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ సైతం రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక అంబులెన్స్లు ఎందుకు అనే విషయానికొస్తే ప్రస్తుతం అలియా గర్భవతి కావడంతో ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఆస్ట్రియా నుంచి లండన్ కి నేరుగా చేరుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే లండన్ లో కూడా హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫో స్టోన్ సినిమాకి సంబంధించి షూటింగ్లో పాల్గొనబోతోంది . ఆమె గర్భవతి కాకముందే ఇందుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు కూడా పూర్తి చేశారు. ఇక అలియా భట్ కి ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెట్లో ఆమె కోసం అన్ని రకాల ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకునే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: