అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి మలయాళం సినిమా ప్రేమమ్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

ఫిదా సినిమా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సాయి పల్లవి తన నటనతో, డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేయాడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చినా కూడా కమర్షియల్ సినిమాలకు , గ్లామర్ షో కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు దూరంగా ఉంటూ,  కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకొని అందులో నటిస్తూ తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పల్లవి, దగ్గుబాటి రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమాలో కథానాయికగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

జూన్ 17 వ తేదిన విడుదల అయిన విరాట పర్వం సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లలో చురుగ్గా పాల్గొంటున్న సాయి పల్లవి అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సాయి పల్లవి తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అని, నాగ చైతన్య , రానా ల పేర్లు చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య , రానా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని , వారితో ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది అని సాయి పల్లవి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: