పక్కా కమర్షియల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం లో ఆయన మరొక యాక్షన్ భరితమైన సినిమాలో నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రాగా ఇప్పుడు చేస్తున్న ఈ మూడవ సినిమా కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టాలని వీరు భావిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నహాలు చేస్తారట.

ఏదేమైనా గోపీచంద్ కెరియర్ ఇప్పుడు చాలా బాగుందని చెప్పాలి దానికి తోడు తాజాగా చేసిన పక్కా కమర్షియల్ సినిమా హిట్ అవడం ఆయనను మరొక స్థాయి హీరోగా ఎదిగెలా చేసింది. అయితే గోపీచంద్ ఇప్పుడు విలన్ గా కూడా చేయాలనుకోవడం ఆయన అభిమానులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కెరియర్ ఆరంభంలో పలు సినిమాలలో విలన్ గా కనిపించిన గోపీచంద్ ఇప్పుడు తిరిగి ఆ తరహా పాత్రులలో కనిపించాలనుకోవడం విశేషం. 

జయం, వర్షం, నిజం వంటి సినిమాలతో గోపీచంద్ విలనగా నటించి ప్రేక్షకులను ఆలరించాడు. మంచి ఒడ్డు పొడుగు, మంచి యాక్షన్ కలిగి ఉండడంతో ఈ నటుడు హీరోగా అయితే బాగా రాణిస్తాడని చెప్పి ఆయన హీరోగా రాణించేలా చేశారు.  అలా అప్పటి నుంచి ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న గోపీ చంద్ సడన్ గా విలన్ గా నటిస్తాను అని చెప్పడం విశేషం. అయితే తన పాత్ర బాగా ఉండి హీరోకి తగ్గ పాత్ర అయితేనే ఆ సినిమాలలో నటిస్తానని గోపీచంద్ చెప్పాడు.  పక్కా కమ ర్షియల్ సినిమాలో ఎంటర్ట్రైనింగ్ గా ఉండే పాత్రలో నటించిన గోపీచంద్ విలన్ గా ఏ ఏ సినిమాలో అవకాశం దక్కించుకుంటాడో చూడాలి. ప్రభాస్ సినిమాలో అయన విలన్ గా నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: