సినిమా పరిశ్రమ లోకి ఎలా వచ్చామన్నది కాదు ఎలా ఎదగామన్నదే ముఖ్యం అన్నట్లు కొంతమంది ముద్దుగుమ్మలు తమ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి హీరోయిన్లు , నటీమణులు రావడం సహజ  మే. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆడవాళ్లు సినిమా పరిశ్రమలోకి రావడం చాలా తక్కువ. ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దాని ద్వారా క్రేజ్ సంపాదించుకొని కొంతమంది నటీమణులు ఇప్పుడు స్టార్ లుగా ఎదిగారు.

అలా టాలీవుడ్ లో యాంకర్ లుగా తమ ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ నటీమణులుగా ఎదిగారు కొంతమంది ముద్దుగుమ్మలు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు కొంతమంది యాంకర్లు. వారిలో అనసూయ మరియు రష్మీ కూడా ఉన్నారు. వీరు తమ కెరియర్ ను యాంకర్ గా మొదలు పెట్టిన కూడా ఇప్పుడు నటీమణులుగా తమ సత్తా చాటుతున్నారు. అనసూ య అయితే కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రల కోసం కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. 

ఆమె ప్రధాన పాత్రలో కొన్ని సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.  ఆ విధంగా అనసూ య యాంకర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ నటిమణిగా ఎదిగింది. రష్మీ కూడా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కూడా ఇప్పుడు నటిగా బిజీగా మారిపోయింది. ఆమె హీరోయిన్ గా పలు సినిమాలు కూడా తెరకెక్కి ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత శ్రీముఖి యాంకర్ గా నటిగా రెండు పాత్రలలో ప్రేక్షకులను అ లరిస్తు ముందుకు వెళుతుంది. అలా వీరు ఇటు సినిమాలలో అటు బుల్లితెరపై ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉండడం విశేషం. వీరే కాకుండా చాలామంది యాంకర్ లు సినిమాలలో నటి స్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: