మహేష్ బాబు హీరోగా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది. సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తన విజయ యాత్రను కొనసాగించిన మహేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో మహేష్ పనిచేసిన దర్శకుడు కావడం ఈ చిత్రం బాగానే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం. దానికి తోడు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాయి.  

ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని తమ కాంబినేషన్ కు ఎదురు లేదు అని మరొకసారి నిరూపించాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో అధికారిక ప్రకటన జరుపుకున్నా కూడా ఇంకా మొదలు కాకపోవడం మహేష్ అభిమానులను కొంత నిరుత్సాహపరిస్తుంది. దానికి కారణం మహేష్ అనే తెలుస్తుంది. సినిమా విడుదల తర్వాత కొన్ని రోజులు వెకేషన్కు వెళ్లే అలవాటు ఉన్న మహేష్ సర్కారు వారి పాట సినిమా విడుదల తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళగా ఇంకా తిరిగి రాకపోవడం వలన ఈ సినిమా మొదలు కాకపోవడానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది. 

ఆ మధ్య మహేష్ బాబుకు ఫైనల్ నరేష్ ఇవ్వడానికి చిత్ర బృందం ఆయన దగ్గరికి విదేశాలకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. వారు తిరిగి వచ్చిన కూడా మహేష్ ఇంకా తిరిగి రాకపోవడం ఈ సినిమా ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం. మరి మహేష్ వచ్చిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో దీనిని విడుదల చేయాలనేది చిత్ర బృందం ఆలోచన. తమన్న సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ భారీ చిత్రం చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: