విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుండగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను జరపడానికి అన్ని సిద్ధం చేస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు.  

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రమోషన్ పాట షూటింగ్ చేసిన చిత్ర బృందం మైక్ టైసన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న ఓ టీజర్ ను విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. అంత పెద్ద హాలీవుడ్ నటుడిని ప్రపంచ ఛాంపియన్ ను ఈ సినిమాలోకి తీసుకురావడం పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. 

ఆ విధంగా ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనేలా చేసిన విజయ్ దేవరకొండసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అంతే వినూత్నంగా చేయాలని భావిస్తున్నాడు. అందుకే రేపు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసి ఇండియా షేక్ అయ్యే విధంగా ప్లాన్ చేశాడు. మరి రేపు విడుదల కాబోతున్న ఆ పోస్టర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ మరికొన్ని ఆసక్తికర సినిమాలలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే మరొక సినిమాను కూడా చేస్తున్న విజయ్ దేవరకొండ మళ్లీ మూడవ సినిమాను కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమా ను కూడా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: