ది వారియర్ సినిమాతో వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో రామ్ పోతినేనిసినిమా తప్పకుండా తనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అన్న భావనలో ఉన్నాడు. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులలో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతున్న రామ్ పోతినేని ఇప్పుడు తన సక్సెస్ జోరును ఈ సినిమాతో కొనసాగిస్తాడని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ఈ సినిమాలో సరికొత్త స్టైల్ లో కనిపించబోతున్న రామ్ తొలిసారిగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండగా ఈ సినిమా తో మంచి విజయం అందుకోవడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్.  ఇది కూడా మాస్ మసాలా సినిమానే కావడం విశేషం. రష్మిక మందన హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించబోతుంది.  అయితే ఈ చిత్రం తర్వాత కూడా రామ్తమిళ దర్శకుడు తోనే సినిమా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. 

ప్రేమ కథ సినిమాలను చేయడంలో గౌతమ్ మీనన్ కు ప్రత్యేకమైన పేరు ఉంది.  ఇప్పటిదాకా ఆయన చేసిన ప్రేమ కథ సినిమాలు సంచలనాత్మక విజయాలను అందుకున్నాయి.  అందులో భాగంగానే ఇప్పుడు తన తదుపరి సినిమాను చేసే క్రమంలో రామ్ పోతినేని తో ఆయన సినిమా చేయాలని భావిస్తున్నాడు. రామ్ పోతినేని కూడా ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో వేచి చూస్తున్న నేపథ్యంలో ఆయనకు సినిమా ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఏ జోనల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. వరుసగా మాస్ సినిమాలో చేస్తున్న నేపథ్యంలో ఈ దర్శకుడితో ఒక మంచి ప్రేమ కథ సినిమా చేస్తే బాగుంటుంది అనేది రామ్ అభిమానుల ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: