హీరో శ్రీకాంత్.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయమై ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు తనదైన శైలిలో కథలు ఎంచుకుంటూ ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కు పోటీ ఇచ్చే లాగా కనిపించాడు. కానీ ఆ తర్వాత కాలంలో శ్రీకాంత్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా హీరోగా అతని గ్రాఫ్ పడిపోయింది.


 దీంతో హీరోగా సినిమాలు చేయడం తగ్గించి.. ఇక ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. ఇలా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత కాలంలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ వచ్చాడు శ్రీకాంత్. నేటి తరం హీరోలకు నాన్నగా బాబాయ్ గా అన్న గా నటిస్తూ వచ్చారు. అయితే ఇటీవలే ఒక సినిమాలో విలన్ పాత్రలో నటించారు. జగపతి బాబు లాగా విలన్ గా సెట్ అవ్వాలి అని భావించారు.


  పవర్ఫుల్ హీరో బాలకృష్ణతో అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు ఇక ఆ సినిమాలో నటించటమే శ్రీకాంత్ కెరీర్ కు మైనస్ గా మారిపోయిందని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ అన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం కేవలం ఒక చిన్న విలన్ మాత్రమే అని తేలింది.  దీంతో అతనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి  దీంతో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు కూడా తగ్గి పోయాయి అని తెలుస్తుంది.. ఒకవేళ అఖండ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించి ఉంటే అతని కీలక మలుపు తిరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: