కమల్ హాసన్ కుమార్తె గా సినీ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి తన నటన,అందం, అభినయం తో అందరిని ఆకట్టుకుంటు వస్తున్న నటి  శ్రుతి హసన్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమె అందరికి తెలుసు.ప్రస్తుతం ఈమె నటసింహం నందమూరి బాలకృష్ణ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?'.. చాలా ఇంటర్వ్యూల్లో నటి శ్రుతిహాసన్‌ కు ఎదురైన ప్రశ్న ఇది.అయితే ఇక ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం.అయితే  శ్రుతి ఎన్నిసార్లు సమాధానమిచ్చినా మళ్లీ మళ్లీ ఆమెకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. 

ఇదిలావుంటే ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ పాల్గొన్నారు.అయితే  వృత్తిపరమైన విశేషాలు అడుగుతూనే సదరు రిపోర్టర్‌ వ్యక్తిగత సంగతులు ఆరా తీశారు. ఇకపోతే ''మీ మ్యారేజ్‌ ఎప్పుడు? ప్లాన్స్‌ ఏంటి?'' అని అడగ్గా ''మీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు'' అని తనదైన శైలిలో చమత్కరించారామె.ఇక  శ్రుతిహాసన్‌.. శాంతాను అనే ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే శాంతాను అంటే తనకెంతో ఇష్టమని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే ''పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వల్ల హార్మోన్ల సమస్య ఎదురైంది.

ఇక ఇది ఎంత కష్టమైందో మహిళలకు తెలుసు. రోజువారీ పనులకూ నా శరీరం సహకరించటంలేదు కానీ నా మనసు బాగుంది.అంతేకాదు  బాగా తింటున్నా, నిద్రపోతున్నా, వ్యాయామాన్ని ఆస్వాదిస్తున్నా'' అంటూ తన వర్కౌట్‌ వీడియోను శ్రుతి షేర్‌ చేశారు.అయితే  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇక  గతేడాది.. 'క్రాక్', 'వకీల్‌సాబ్‌' విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు శ్రుతి. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌' , #NBK107 (బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం) సినిమాలో నటిస్తున్నారు.అయితే  'కేజీయఫ్‌' ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌', గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో 'ఎన్బీకే 107' తెరకెక్కుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: