టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే ముకుంద , ఫిదా , తొలిప్రేమ వంటి ప్రేమకథా సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకొని , అలాగే గద్దలకొండ గణేష్ లాంటి పవర్ ఫుల్ మాస్ పాత్రలో నటించి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. 

కెరియర్ లో మొట్ట మొదటి సారి వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం ఉన్న సినిమాలో నటించడం,  అలాగే అందుకు అనుగుణమైన బాడీని పెంపొందించుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన గని సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా,  ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు  ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించగా , ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

మూవీ ని రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మించారు. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన గని సినిమా కొంత కాలం క్రితం నుండే 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోయిన గని సినిమా 'ఓ టి టి' నుంచి మాత్రం పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే గని  సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరికొన్ని రోజుల్లో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. మరి గని మూవీ బుల్లితెర అభిమానులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: