తెలుగు సినీ ప్రేమికులకు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా , నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ కి బన్నీ , భగీరథ మూవీ లకు నిర్మాతగా వ్యవహరించిన మల్లిడి సత్యనారాయణ తనయుడు వశిష్ట్  దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడిగా వశిష్ట్ కు మొదటి సినిమా. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తుండగా,  కీరవాణి ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. చోటా కె నాయుడు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. బింబిసార మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కుతుండగా కె హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బింబిసార మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా బింబిసార చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో సినీ ప్రేమికులు ఈ మూవీ ట్రైలర్ పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని చిత్ర నిర్మాతలు భారీ బడ్జెట్ తో , హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: