సినిమా ఇండస్ట్రీ లో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉండడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏదైనా స్టార్ హీరోగా నటించిన ఈ సినిమా గాని ,  స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమా గాని పోటీలో ఉన్నట్లు అయితే చిన్న సినిమాలు విడుదల అయిన కానీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అదే ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయినట్లయితే బాక్సాఫీస్ దగ్గర చాలా కోలాహలం ఉంటుంది.

సినీ ప్రేక్షకులు సైతం ఏ సినిమాకు అలాంటి టాక్ వస్తుందో , ఎ మూవీ మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఇలాంటి వాతావరణమే ఆగస్ట్ 11 వ తేదీన కనిపించేలా ఉంది.  ఆగస్ట్ 11 వ తేదీన బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్ద మూవీ , అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం,  అలాగే విడుదల తేదీ కూడా దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను కూడా వేగవంతం చేసింది. అందులో భాగంగా తాజాగా అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రెండు సినిమాల భారీ క్లాస్ కు సంబంధించి వివరణ ఇచ్చాడు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ సెలవులు ఉన్న రోజులు చాలా మంచివి,   రెండు సినిమాలకు కూడా మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంటుంది.  గతంలో తన మూవీ వెల్‌కమ్ మరియు అమీర్ యొక్క తారే జమీన్ పర్ మూవీలు కూడా మంచి విషయాలను అందుకున్నాయి అని అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.  ఇలా ఈ రెండు భారీ సినిమాల క్లాస్ గురించి అక్షయ్ కుమార్ చాలా సున్నితమైన సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: