అక్కినేని ఇంటి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హీరో నాగ చైతన్య. రావడం రావడం మొదటి సినిమా కాస్త పట్టాలు తప్పి ఫ్లాప్ అయ్యింది . దాంతో అరే ఏంటిది ఇండస్ట్రీలోకి శుభమా అని ఎంట్రీ ఇస్తే ఇలా మొదటి సినిమానే బెడిసి కొట్టింది అని చాలామంది అన్నారు. కానీ సినీ పరిశ్రమలో ఇలాంటి ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు అనేవి సహజం. కానీ మొదటి సినిమా కనుక హిట్ అయితే వచ్చే కిక్కే వేరు, నిజమే కదా మన మార్గం మాత్రమే కాదు వేసే తొలి అడుగు, చేరే తీరం రెండు చాలా చాల్ స్పెషల్ గా ఉండాలని అంతా కోరుకుంటాం . అలా తొలి సినిమా క్లిక్ అయితే ఇండస్ట్రీలో కొన్ని లెక్కలుంటాయి . కానీ వాటిని చైతు మిస్స్ అయ్యాడనే చెప్పాలి.

కాగా నిజానికి చైతు తండ్రి నాగార్జున కనుక ఆనాడు ఒప్పుకుని ఉంటే, నిర్మాత దిల్ రాజు మాట విని ఉంటే హీరోగా నాగ చైతన్య ఫస్ట్ స్టెప్ కూడా సూపర్ హిట్ తో ది బెస్ట్ స్టెప్ గా నిలచి ఉండేది. కానీ నాగ్ నో అనటంతో అది కాస్త మిస్స్ అయ్యింది.  ఇంతకీ అసలేం జరిగింది అంటే... నాగ చైతన్య తొలి సినిమా జోష్ అన్న విషయం తెలిసిందే. ఇది కాస్త అంచనాలు తారుమారు చేసి ఫ్లాప్ గా మిగిలింది. ఈ కథను ఒకే చేసింది స్వయంగా నాగార్జున గారే. ఈ కథ మొదట రామ్ చరణ్ కోసం అనుకోగాచెర్రీ కి కథ నచ్చగా...చిరు మాత్రం స్టోరీని  విని నచ్చలేదు అని చెప్పేశారట. ఒకసారి నాగబాబు కు వినిపించండి అని చెబితే ఆయన కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వద్దు అన్నట్లుగా మాట్లాడారట.

అలా ఆ స్టోరీ నాగార్జున చేతికి వెళ్ళింది...ఎపుడు నాగ్ ఆ కథ విని ఒకే చేసి నాగ చైతన్య ను పరిచయం చేయడానికి ఇదే కరెక్ట్ స్టోరీ అనుకున్నారట. అలా ఈ సినిమా నాగ చైతన్య చేశాడు. కానీ అనుకున్న ఫలితం మాత్రం అందలేదు. అయితే నిజానికి మొదట నాగ చైతన్య చేయాల్సిన సినిమా కొత్త బంగారు లోకం అట. ఈ కథ నాగ చైతన్యకి అయితే బాగుంటుందని దిల్ రాజు నాగార్జున వద్దకు వెళ్లగా...లేదు మొదటి సినిమా కాస్త యాక్షన్ ఫిల్మ్ అయితే బాగుంటుంది అని నాగ్ రిజెక్ట్ చేశారట. అలా నాగ చైతన్య చేయాల్సిన బంగారు లోకం సినిమా కాస్త వరుణ్ సందేశ్ చేతికి వెళ్ళింది. తీరా చూస్తే అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా పేరు చెప్పుకుని వరుణ్ సందేశ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు అలా గడిపేశాడు. అదే సినిమా కనుక నాగ చైతన్య అకౌంట్ లో పడి ఉంటే ఆ లెక్కే వేరేలా ఉండేది. అందుకే  ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఇది  గుర్తొచ్చినప్పుడల్లా ఆ రోజు అలా చైతు విషయం లో చేయకుండా ఉంటే బాగుండేది నాగ్ అనుకుంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: