2022 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయ నే విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు గా పూర్తైందట . ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ నెల 9వ తేదీన నాగ్ కీలక పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం పార్ట్1 విడుదల కానుందనే విషయం తెలిసిందే. నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుందట.


 


బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ కుదిరితే దసరా కుదరని పక్షంలో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉందట.. సల్మాన్ ఖాన్, వెంకటేష్ కాంబోలో కభీ ఈద్ కభీ దివాళి పేరు తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాది చివరి వారం లో ఈ సినిమా రిలీజ్ కానుందట.. టాలీవుడ్ సీనియర్ హీరోలై న నలుగురు హీరోలు ఈ ఏడాది సెకండాఫ్ లో లక్ ను పరీక్షించుకుంటున్నార ని తెలుస్తుంది..


 


ఈ హీరోలలో ఎవరెవరి కి సక్సెస్ దక్కుతుందో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం అయితే లేదని సమాచారం.మరి చూడాలి ఈ సీనియర్ హీరోలు ఏ విధముగా మెప్పిస్తారో. వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: