చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇక ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. తన తండ్రి బ్యాక్గ్రౌండ్ కాకుండా సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే చోర్ బజార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు ఆకాష్ పూరి.


 వివిధ రకాల బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ తెగ సందడి చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా విడుదలైన కూడా వాళ్లు ఇక ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కి ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి బాటలోనే అటు ఆకాష్ పూరి కూడా క్యాష్ స్టేజ్ పై ప్రమోషన్స్ కోసం అడుగు పెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడిగా మారింది అని చెప్పాలి..



 అయితే ఇక ఇటీవల ప్రోమోలో లో భాగంగా చోర్ బజార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన గెని సిప్పి  హీరో ఆకాష్ పూరి కి షాక్ ఇచ్చింది.  సాధారణంగా షో లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి సెలబ్రిటీని ఇరకాటంలో పెట్టేందుకు ఆసక్తి గల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది సుమ. ఈ క్రమంలోనే హీరోయిన్ గెని సిప్పిని.. జీవన్ రెడ్డి, ఆకాష్ పూరి వీరిద్దరిలో ఎవరితో నటించడం టాప్ గా అనిపించింది అంటూ అడుగగా.. ఇక ఆకాష్ పూరి పేరు చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా జీవన్ రెడ్డి పేరు చెప్పింది హీరోయిన్. దీంతో ఒక్కసారిగా హర్ట్ అయినా ఆకాష్ పూరి షో నుంచి వెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: