ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరెడ్డి తన కామెంట్ల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించారనే సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా కూడా ఆమె గురించి మాత్రం చాలామందిలో కూడా సదభిప్రాయం అనేది ఉంది.అయితే మెగా ఫ్యామిలీ గురించి ఇంకా అలాగే ఇతర విషయాల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో ఎదగకుండా మెగా ఫ్యామిలీ తొక్కేసిందని శ్రీరెడ్డి తెలిపారు.కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కళ్యాణ్ , నాగబాబులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. నేను పైకి రాకుండా మెగా కుటుంబం నన్ను అడ్డుకుందని అయితే దేవుడు మెగా కుటుంబం పునాదులను కదుపుతున్నాడని కూడా శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. మెగా కుటుంబం నుంచి కేవలం బన్నీ మాత్రమే ప్రతిభతో పైకి వచ్చాడని ప్రతిభ లేని వాళ్లు పండిపోయిన పండ్లలా రాలిపోతున్నారని కూడా శ్రీరెడ్డి పేర్కొన్నారు.మెగా కుటుంబంలో ఆడపిల్లల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా అందరికీ తెలుసని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం మెగా ఫ్యామిలీని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది బ్రతుకుతున్నారని కూడా శ్రీరెడ్డి అన్నారు. ఈ మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలను తొక్కేసిందని కర్మ ఎవరినీ వదలదని శ్రీరెడ్డి తెలిపారు. నాపై ఎన్నో కేసులు పెట్టారని బిగ్ బాస్ షోకు నేను రాకుండా అడ్డుకున్నారని ఆమె అన్నారు.ఇక యూట్యూబ్ వీడియోలు చేయడం ద్వారా నేను లైఫ్ ను నిలబెట్టుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిభ ఉన్నా కూడా నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని అయితే ఒక వర్గం ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. అలాగే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లను కర్మ వదిలిపెట్టదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. శ్రీరెడ్డికి గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు సైతం తగ్గాయనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: