నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మెంటల్ మదిలో మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఆ తర్వాత బ్రోచేవారెవరురా మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. అంటే సుందరానికి మూవీ లో నజ్రియా కథానాయికగా నటించింది. 

ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ జులై 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ టాక్ ను సంపాదించుకుంది. అలా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకున్న అంటే సుందరానికి మూవీ డీసెంట్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసిన అంటే సుందరానికి మూవీ మరికొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించిన  అప్డేట్ కూడా తాజాగా బయటకు వచ్చింది.

అంటే సుందరానికి మూవీ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన నేట్ ఫ్లిక్స్ లో జూలై 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా నేట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఎవరైనా ఈ సినిమాలు థియేటర్ లో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే, జూన్ 10 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: