టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 

నితిన్ ఆ తర్వాత సై , ఇష్క్ , గుండె జారి గల్లంతయ్యిందే వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నితిన్ ప్రస్తుతం ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను 12 ఆగస్ట్ 2022 న విడుదల చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనునట్లు, ఆ ఐటమ్ సాంగ్ లో అంజలి నటించనున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో అంజలి తన నడుము అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఈ ఐటమ్ సాంగ్ తో అంజలి ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: