తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఇకపోతే  ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.అయితే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శర వేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ ఫోటో విడుదల చేశారు. 

ఇకపోతే ఒంటిపైనూలు పోగు లేకుండా ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజెన్లు ట్రోలింగ్ కి గురైంది.అయితే  ఇలా ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు సైతం ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా అసలు విషయం ఏమిటంటే  తాజాగా ఈ ఫోటో విషయంలో ఒక నెటిజన్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇకపోతే ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోని ఎడిట్ చేసి తన ఫోటోకి ప్యాంట్ వేశారు. ఇక ఇలా తన ఫోటోకి ప్యాంట్ వేసి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 

నాకు తరువాత ధన్యవాదాలు చెప్పండి బ్రదర్ అంటూ విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు. అయితే ఇక ఈ ఫోటో చూసిన విజయ్ దేవరకొండ ఈ ఫోటో పై స్పందించారు. విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ సకాలంలో ఆదుకునే నిజమైన వ్యక్తి నువ్వే బ్రదర్ అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ విధంగా ఈ ఫోటో పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ కామెంట్ చేయడం వైరల్ అవుతుంది.ఇదిలావుంటే  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ సెంటిమెంట్ డే ఆగస్టు 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: