వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న వరుణ్ తేజ్ కు గని సినిమా బ్రేకులు వేసింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక ఆయనకు చాలా రోజుల తర్వాత ఒక ఫ్లాప్ తెచ్చి పెట్టింది. ఓ కొత్త దర్శకుడు తో కలిసి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవడం ఆయనను ఒక్కసారిగా నిరాశపరిచింది అని చెప్పాలి.  ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ఈ సినిమా ఇలా అవ్వటం ఎవరికైనా పెద్ద నిరాశ మిగులుస్తుంది మరి.

ప్రస్తుతం ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకు వెళ్ళబోతుండగా ఆ సినిమాలో వరుణ్ సీఈఓ గా నటించబోతున్నాడు అని అంటున్నారు. మెగా హీరోగా సినిమా పరిశ్రమంలోకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ హీరో ఎప్పటిదాకా అందరికంటే భిన్నమైన సినిమాలను చేస్తూనే వచ్చాడు. అయన గత సినిమా గద్దల కొండ గణేష్ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈనేపథ్యంలో ఆ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో గని పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కనీ సినిమా ఆ అంచనాలు అందుకోలేకపోయింది. 

ఆ విధంగా ఇలాంటి విభిన్నమైన సినిమాలను చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్ ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్దేశంతో స్పోర్ట్స్ డ్రామా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే దానిలో ప్రేక్షకులు అనుకున్న కథ కాకుండా వేరొక కథ ఇమిడి ఉండడంతో ఈ సినిమాను వారు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఫలితంగా ఇది ఒక పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా అందరిని తీవ్ర నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ద్వారా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో వరుణ్ తేజ్. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని

మరింత సమాచారం తెలుసుకోండి: