తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానుల, మీడియా వర్గాల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువయిపోతున్నాయి. ఎవరైనా కొత్తగా వచ్చి టాలెంట్ ను నిరూపించుకుని ఎదుగుతుంటే ఎందుకో వారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానితోడు కొన్ని మీడియా వర్గాలు కూడా ఇలాంటి వారిని తొక్కేయడానికి చూస్తున్నాయి. అనవసరపు, లేని ఆబండాలను సదరు ఎదుగుతున్న హీరో పై వేసి ఆయనని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ ను కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది.

కానీ విజయ్ వారికి కిందకి లాగుతున్న కొద్దీ పై పైకి ఎదగడం వారి చెంప మీద చెళ్లుమని కొట్టినట్లు అనిపిస్తుంది. గతంలో అయన సినిమాలపై నెగెటివిటి చేసే ప్రయత్నం చేశారు.  తాజాగా అయన చేస్తున్న లైగర్ సినిమా పై కూడా విషపు ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సదరు వ్యక్తులు. అందులో భాగంగా సినిమాలో డిమాండ్ చేసిన ఓ బోల్డ్ పోస్టర్ ను విడుదల చేసి సినిమాపై హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేసిన యూనిట్ పై కొంతమంది కావాలని బురద చల్లుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను చూసి తట్టుకోలేక కొన్ని మీడియా వర్గాలు, కొంతమంది హీరోల కొమ్ము కాసే తొత్తులు, అలాగే ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ వీరిపై విమర్శలు చేస్తున్నారు.

ఏదేమైనా దేశం మొత్తం అటెన్షన్ వచ్చేలా చేయడం లో లైగర్ టీం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అభిమానులు కూడా తమ హీరో నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో దాన్ని బాగా ప్రమోట్ చేసుకోగలిగారు. అయితే గతంలో ఇలాంటి బోల్డ్ ఫోజ్ లు చాలామంది హీరోలు ఇచ్చారు . బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి హీరో, హాలీవుడ్ లో కొంతమంది హీరోలు న్యూడ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పుడు వారిని చూసి ఆహా.. ఓహో అన్న ప్రబుద్ధులు ఇప్పుడు విజయ్ దేవరకొండ పోస్టర్ ను యాక్సెప్ట్ చేయలేకపోవడం వారి నీచమైన బుద్ది కి నిదర్శనం అని చెప్పాలి. ఇక పోతే ఈ సినిమా ఆగస్ట్ 25 వ తేదీన ప్రేక్షకులముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: