యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే.

సినిమా తర్వాత ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 31 వ సినిమా. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. అందుకు సంబంధించి చిత్ర బృందం ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉండనునట్లు, ఆ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన కమల్ హాసన్ ను నటింపజేయడానికి ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఆ పాత్రలో కమల్ హాసన్ నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. దాంతో ప్రశాంత్ నీల్,  మోహన్ లాల్ ని ఎన్టీఆర్ 31 సినిమాలో కీలక పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కు ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: