పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి మనకి తెలియంది కాదు.ఈయన తాజాగా  హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇక  ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడం లేదని చిత్రయూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదిలావుంటే ఇప్పటివరకు ప్రభాస్ సలార్ మూవీలో ఐదు యాక్షన్ సన్నివేశాలలో నటించాడని ప్రస్తుతం ఆరో యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది. 

ఇకపోతే సాధారణంగా ఒక సినిమాలో గరిష్టంగా 4 కంటే ఎక్కువ యాక్షన్ సీన్లు ఉండవు.ఇక  అదే సమయంలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ సీన్లు కూడా యాక్షన్ సీన్లేనని తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ యాక్షన్ సన్నివేశాల వల్ల సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. కాగా సలార్ పార్ట్1 సలార్ పార్ట్2 కేవలం నాలుగు నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.అయితే సలార్ మేకర్స్ మరోసారి స్పందిస్తే మాత్రమే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.ఇక  సలార్ రెండు భాగాలు వచ్చే ఏడాది రిలీజైతే మొత్తం ప్రభాస్ 4 సినిమాలు 2023లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

కాగా ఆదిపురుష్ మూవీ ఇప్పటికే 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఫిక్స్ అయింది. పోతే ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలుకానుందని వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.ఇకపోతే రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.ఇకపోతే ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: