కొంతమంది హీరోయిన్ లకు ఏమాత్రం కలిసి రాదు. వారిలో ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఎంతమంది సప్పోర్ట్ ఉన్నా కాలం కలిసి రాక వారు నార్మల్ హీరోయిన్స్ గానే మిగిలిపోతూ ఉంటారు. అలా మంచి సినిమాలే చేసిన ఓ హీరోయిన్ కి తెలుగు సినిమా పరిశ్రమలో ఏమాత్రం కలిసి రాలేదు. ఆమే అను ఇమ్యాన్యుయెల్. ఈ అందాల భామ గురించి టాలీవుడ్ సినిమా పరిశమ్రలో ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ సినిమాల్లో రాణించాలని కలలు కనేది అలా ఆమే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది.

'స్వప్న సంచారి' అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈమె చిన్నప్పుడే తన టాలెంట్ ను నిరూపించుకుంది. అక్కడ మంచి నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత 'యాక్షన్ హీరో బిజు'తో కలిసి నటించి  హీరోయిన్ గా మారింది. అలా సినిమా పరిశ్రమలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు లో  న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపుదిద్దుకున్న 'మజ్ను' మూవీ తో పరిచయం అయ్యింది. మంచి అందం, అందానికి తగ్గ అభినయం కలిగి ఉండడంతో ఈమెకు ఇంతమంచి అవకాశం వచ్చింది. అలా టాలీవుడ్ లో చేసిన తొలి ప్రయత్నంలోనే ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత పెద్ద అవకాశాలను సైతం అందుకుంది. కానీ ఆమె హీరోయిన్ గా ఇంకో లెవెల్ కి మాత్రం వెళ్లలేకపోయింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ ఆమెపై బాగా పడింది. ఆ సినిమా పై ఆమె మంచి అంచనాలే పెట్టుకోగా అది రివర్స్ అయ్యే సరికి ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అభిమానులు కూడా అను మంచి హీరోయిన్ అవ్వలేకపోయిందనే బాధలో ఉన్నారు. హిట్ ల సంగతి తర్వాత ముందు ఆమె సినిమా అవకాశాల కోసం కష్టపడుతుంది. ఇప్పటికే కుర్ర హీరోయిన్ ల తాకిడి ఎక్కువవుతుండడంతో ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే సినిమాలు అవకాశాలు రాబట్టుకోవాల్సిందే. వాటితో హిట్ లు కొట్టాల్సిందే. త్వరలోనే ఆమె అల్లు శిరీష్ హీరో గా నటిస్తున్న సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: