మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితమే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే . ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక పోయింది . దానితో చివరగా ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది . 

ఇలా ఆచార్య సినిమాతో అపజయాన్ని బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ ,  మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ , బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది . తాజాగా గాడ్ ఫాదర్ చిత్ర బృందం ఈ సినిమాలో చిరంజీవి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది . గాడ్ ఫాదర్ చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ లుక్ లో కూర్చొని ,కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని , చేతికి వాచీ పెట్టుకొని ఉన్నాడు .  ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్ర బృందం విడుదల చేసిన చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా , లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. వీరితో పాటు ఈ సినిమాలో సత్యదేవ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: